ఘనంగా నాగుల చవితి వేడుకలు

-కొయ్యూరు నాగులమ్మ దేవాలయంలో పోటెత్తిన భక్త జనం

మల్హర్‌,నవంబర్‌ 11( జనంసాక్షి);మండలంలో ఆదివారం నాగుల చవితి సందర్బంగా భక్తి శ్రద్దలతో మహిళా భక్తులు నాగమ్మ తల్లికి మ్రొక్కులు తీర్చుకున్నారు.కొయ్యూరు అటవీ ప్రాంతంలోని కోయకుంట నాగులమ్మ దేవాలయంలో నాగులమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.నాగమ్మ తల్లికి పాలు పెరుగు పుట్టలో పోసి పసుపు కుంకుమలు చల్లి కొబ్బరికాయలు కొట్టి మ్రొక్కులు తీర్చుకున్నారు.పాడి పంట రక్షించాలని వేడుకునారు.