ప్రజాసేవలో అందుబాటులో ఉంటున్న నన్ను ఆశ్వీరదించండి

కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి

జగిత్యాల బ్యూరో,నవంబర్‌11(జనంసాక్షి): సష్టికి ప్రతిస ష్టి చేసే మెలకువ కలిగి , సాంకేతిక నైపుణ్యం కలిగిన విశ్వబ్రాహ్మణులకు ఎల్లవేళలా అండగా ఉంటామని తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రం లోని హనుమాన్‌ వాడ 38 వార్డులో విశ్వ బ్రాహ్మణ సంఘం 70 కుటుంబాలకు చెందిన 150 మంది మహా కూటమి అభ్యర్థి జీవన్‌ రెడ్డికి మద్దతు ప్రకటించి రాగుల శారదా గోపాల్‌ చారి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ విద్య మేధో సంపత్తితో నైపుణ్యం సంపాదించి చేతి వత్తుల మెలకువలతో జీవనోపాధి పొందుతున్నది విశ్వ బ్రాహ్మణులని చెప్పక తప్పదన్నారు. గ్రామీణ ప్రాంతంలో పునాస వచ్చిందంటే, శుభకార్యాలకు గుర్తుకు వచ్చేది విశ్వ బ్రాహ్మణులెనని అన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతం లో పని కరువైంద, ప్రభుత్వం పెద్ద పరిశ్రమలకు ఇచ్చిన రాయితీ విధంగా, కుల వత్తులపై ఆధారపడ్డ కుటుంబాలను గుర్తించి, కుల వత్తులను సైతం పరిశ్రమగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. ఎం.బి.సి లను గుర్తించి 1000కోట్లు కేటాయించిన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం 1000 రూ.లు కూడా ఖర్చు చెయ్యలేదని అన్నారు. కుల వత్తుల ప్రోత్సాహం లేనప్పుడే నిరుద్యోగ సమస్య మొదలవుతుందన్నారు. ఎవరికివారే ఉద్యమనేతలుగా, జాతిపితలుగా చెప్పుకుంటున్నారని, కానీ నిజమైన తెలంగాణ జాతిపిత, తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెస్సర్‌ జయశంకర్‌ అన్నారు. శ్రీకాంత్‌ చారి అగ్నికి ఆహుతై తెలంగాణ రాష్టాన్ని కళ్ళ జూసేలా చేసిన ఘనత ఈ విశ్వ బ్రాహ్మణా వర్గానికి చెందిన త్యాగాలతోనే అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విశ్వ బ్రహ్మణుల పాత్ర అనిర్వచనీయం అన్నారు. భవిషత్‌ లో మహా కూటమి అధికారం లోకి రాగానే ఏడాదికి లక్ష ఉద్యోగాల కల్పనతో పాటు రానున్న 5 ఏండ్లలో ఉద్యోగాల క్యాలెండర్‌ విడుదల చేస్తామన్నారు. బిసి సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు చేసి, యువతకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేస్తామని అన్నారు. కుల వత్తులకు విద్యుత్‌ రాయితీ అందడానికి తన వంతు కషి చెయ్యడం తో పాటు, సామూహిక భవన నిర్మాణానికి 5 లక్షల నిధులు కేటాయింపు, స్థల సేకరణకు ప్రత్యేక శ్రద్ధ చేపడుతామన్నారు. గడిచిన నాలుగేళ్లలో అధికారమే పరమవాదిగా భావించిందని, కుటుంబ పాలనకు తెరలేపిందన్నారు. కల్వకుంట్ల కుటుంబ కబంధ హస్తాల్లో చిక్కిన తెలంగాణ ను మహా కూటమికి మద్దతు ఇచ్చి తెలంగాణ ను రక్షించడంతో పాటు, 40ఏళ్లగా ప్రజా జీవితం లో ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజలకు సేవచేస్తున్న తనను ఆదరించి, గెలిపించాలని మహా కూటమి విజయానికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమము లో విశ్వ బ్రాహ్మణా సంఘ నాయకులు వనతడుపుల రత్న చారి, కంచర్ల రవి, కంచర్ల ఆనందం, భూషణం, సత్తయ్య, కష్ణ స్వామీ, శంకరయ్య, భీమయ్య, లక్ష్మణ్‌, శ్రీనివాస్‌ తో పాటు విశ్వ బ్రాహ్మణ కుటుంబాలు, 38వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.

జీవన్‌ రెడ్డి కి మద్దతుగా కాంగ్రెస్‌ లో చేరికలు

రాయికల్‌ మండలంలోని అల్లిపూర్‌, లచ్చక్క పేట, రంగపేట, సారంగపూర్‌ మండలం లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేస్తూ చేతి గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈసందర్భంగా తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం మిషన్‌ కాకతీయ అని చెప్పి చెరువులు చేపడుతామని కమిషన్లు దండుకున్నారని, రైతు బంధు, రైతు భీమా తో రైతుల పాసు పుస్తకాలలో అనేక తప్పులు వున్నాయని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు ఇచ్చామని, ఇప్పుడు కేసీఆర్‌ డబుల్‌ బెడ్రూం అని చెప్పి ఇందిరమ్మ పథకం ను రద్దు చేసి ఏఒక్కరికి డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తనను ప్రజలు గెలిపించాలని కోరారు.