గాంధీ భవన్‌కు వద్ద ‘రెడ్డి’ వర్గీయుల ఆందోళన

వేములవాడ రూరల్‌(జనంసాక్షి): వేములవాడ నియోజకవర్గం లోని కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న అసమ్మతి సెగ గాంధీ భవన్‌ కు తాకింది వలసవాదులకు, అవకాశవాదులకు టిక్కెట్టు ఇవ్వొద్దంటూ ”రెడ్డి” వర్గీయుల ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ వద్ద నిరసన చేపట్టారు. నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఏనుగు మనోహర్‌ రెడ్డికే టికెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ఆయన వర్గీయులు సుమారు 2 వందల మందికి పైగా ఆదివారం గాంధీ భవన్‌ను ముట్టడించారు. నియోజకవర్గంలో తాము బలంగా ఉంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వలసవాదులకు, అవకాశవాదులు టికెట్‌ ఇలా కేటాయిస్తారని నిలదీశారు . గాంధీభవన్లో నికి చొచ్చుకొని పోయారు. అధిష్టానం నిర్ణయాన్ని మార్చుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్‌ చేశారు.