బెల్ట్‌షాప్‌పై టాస్క్‌ఫోర్స్‌ దాడి

గోదావరిఖని, నవంబర్‌ 18, (జనంసాక్షి) :
గోదావరిఖనిలోని తిలక్‌నగర్‌  ఏరియాలో బెల్ట్‌ షాపు పై రామగుండం టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఆదివారం దాడి చేశారు. రామగుండం  పోలీస్‌ కమీషనర్‌ సత్యనారాయణ  ఉత్తర్వుల ప్రకారం, టాస్క్‌ ఫోర్స్‌ అడిషనల్‌ డిసిపి(అడ్మిన్‌) అశోక్‌ కుమార్‌  ఆదేశాల మేరకు టాస్క్‌ ఫోర్స్‌ సీ.ఐ. సాగర్‌, సిబ్బంది గోదావరిఖనిలోని తిలక్‌ నగర్‌  ఏరియాలో రహస్యంగా ఏర్పాటు చేసుకుని నడిపిస్తున్న  బెల్ట్‌ షాపుపై పక్కా సమాచారం మేరకు దాడిచేసి తనిఖీ లు చేపట్టి వారి వద్ద నుండి  ఐబి,  ఎం.సి, ఓసి మరియు తెలంగాణ బాటిల్‌లు, క్వార్టర్‌ లులి స్వాధీనం చేసుకొని వాటితో పాటు పట్టుబడ్డ నిందితుడు కాసిపేట బాబుని తదుపరి చర్య కోసం లిగోదావరిఖని ఒకటవ పట్టణ పోలీసులకు అప్పగించారు.