టిఆర్‌ఎస్‌ పతనమే ఓయు జేఏసీ లక్ష్యం

-ఓయూ జేఏసి చైర్మన్‌ భూపెల్లి నారాయణ

ముత్తారం(జనం సాక్షి)

టిఆర్‌ఎస్‌ పార్టీ పతనమే ఓయూ జేఏసీ లక్ష్యమని ఓయూ జేఏసీ చైర్మన్‌ భూపెల్లి నారాయణ అన్నారు.ఆదివారం ముత్తారం మండలంల కేశనపల్లిలో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా వచ్చిన జేఏసి బస్సు యాత్ర విద్యార్థి బృందానికి టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి నాగినేని జగన్‌మోహన్‌రావు,జెడ్పీటీసీ చొప్పరి సదానందం ఘన స్వాగతం పలికారు.బస్సు యాత్రలో వచ్చిన వారికి పూల మాలలు వేసి ప్రసంగాన్ని ప్రారంభించారు.వారు మాట్లాడుతూ 1200మంది విద్యార్థుల బలిదానాలను చూసీ సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే, నీళ్ళు,నిధులు,నియామకాలు వస్తాయనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగింది కేసిఆర్‌ కుటుంబ పాలనగా తయారయిందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం 700పెన్షన్‌ ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 300మాత్రమే ఇస్తుందని ఆన్నారు.రానున్న ఎన్నికల్లో కెసిఆర్‌ను గద్దె దింపెందుకు సిద్దంగా ఉండాలని,ఈ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థి కాంగ్రెస్‌ నేత శ్రీధర్‌బాబుకు ఓటు వేసి భారీ మెజారీటీతో గెలిపించాలని కొరారు.ఈ కార్యక్రమంలో జేఏసీ నాయపాపలువుపాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో తిరుపతి,మంథనికుమార్‌,వంజుల,సతీష్‌,దేవెందర్‌,రవి,రమేష్‌,బాలజి,శివ,రాజయ్య,

వాజిద్‌పాషా,చాంద్‌పాషాలతో పాటు పలువురు పాల్గొన్నారు.