పేద ప్రజల పార్టీ కాంగ్రెస్ ఎంఎస్ రాజ్ ఠాకూర్
గోదావరిఖని, నవంబర్ 25, (జనంసాక్షి) :
కాంగ్రెస్ పేద ప్రజల పార్టీ అని రామగుండం నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థి ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఆదివారం రామగుండం అయోధ్యనగర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమిలేదని అన్నారు. నాలుగు సంవత్సరాల్లో దిగిపోయిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మరోసారి పదవీ కాంక్షతో ఎన్నికలకు సిద్దమైందన్నారు. ప్రజలు బుద్దిచెప్పే రోజులు వస్తున్నాయని, రానున్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అదికారంలోకి వస్తుందన్నారు. పేద ప్రజలకు అండగా ఉంటుందని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయని అబివృద్ది కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తుందన్నారు. తనను ఎమ్మెల్యే అభ్యర్తిగా గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.