తెలంగాణ కోసం ఒక్క మంచి మాట మాట్లాడని వాళ్లకు ఓటేందుకు వెద్దాం
సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఓటేద్దాం సిద్దిపేట ప్రచార సభల్లో మంత్రి హరీష్‌రావు సిద్దిపేట బ్యూరో, నవంబర్ 25: సోనియా గాందీ తెలంగాణకు వచ్చి ఆంద్ర మాట మాట్లాడిందని, ఒక మంచి మాట తెలంగాణ కోసం మాట్లాడలేదని మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్, హనుమాన్ నగర్, రంగధాంపల్లి ప్రచార సభల్లో ఆదివారం మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న 5 సీట్లు కూడా బిజేపికి రావన్నారు. బిజేపి పాలిత ప్రాంతాల్లో రైతులు తిరగబడుతున్నారని అన్నారు. ప్రతి పక్షాల మాటలు విని మోసపోవద్దని కోరారు. ఉద్యమంలో, అభివృద్దిలో ముందున్న సిద్దిపేట మెజార్టీలో కూడా ముందుండాలని కోరారు. మీ బిడ్డగా నాలుగన్నర ఏళ్లుగా కష్టపడ్డ నాకు ఎన్ని మార్కులు వేస్తారో వేయండని ప్రజలను కోరారు. సీఎం కేసీఆర్ దీవెనలతో, మీ అందరి ఆశీస్సులతో ఎక్కువ బాధ్యతలు చేపట్టానని, దాంతో బయట తిరుగుతున్నానని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఏ పండుగా వచ్చినా, ఏ ఆపద వచ్చినా మీ కుటుంబ సభ్యునిగా పని చేసిన అన్నారు. సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ది చేసానని, ఆపోల ఆసుపత్రి మాదిరిగా ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేసుకున్నామని అన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా డెలవరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి, మళ్లీ ఇంటి దగ్గర చేరుస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు కనీసం ఆడ బిడ్డ పెండ్లి అయితే 10 రూపాయలు ఇచ్చారా అని అన్నారు. పేద వారి కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. రైతు బందు పథకం రద్దు చేస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు, వారినే ప్రజలు రద్దు చేయాలన్నారు. రైతు బాందవుడిగా కేసీఆర్ పని చేసున్నారని, మళ్లీ వానకాలం నాటికి కాళేశ్వరం నీళ్లు వచ్చి నర్సాపురం చెరువు మత్తడి దుంకుతుందన్నారు. నర్సాపూర్‌లో ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి పేదవారికి ఇండ్డు కట్టిస్తామన్నారు. మీ స్వంత భూమిలో ఇండ్లు కట్టుకుంటే 5లక్షల సహాయం చేస్తామన్నారు. నెలకు 3వేల పించన్ రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 300 కోట్ల రూపాయలతో సిద్దిపేటలో భూగర్బ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించుకుంటున్నామని తెలిపారు. రాబోయే రాజుల్లో మహిళలకు మంచి ఉపాది అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, నేతలు పాల్గొన్నారు.



