రెండు నెలల్లో జాతీయ జైళ్ల అకాడమీ నిర్మాణ పనులు
హైదరాబాద్: జాతీయ స్థాయిలో జైళ్లశాఖ అధికారులకు మెరుగైన శిక్షణ అందించేందుకు రాష్ట్రంలో చేయుతలపెట్టిన జాతీయ జైళ్ల అకాడమీ నిర్మాణ పనులను మరో రెండు నెలల్లో ప్రారంభించేందుకు తగిన చర్యలు చేపట్టాలని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతిష్ఠాత్మకమైన జాతీయ అకాడమీ ఏర్పాటుపై శుక్రవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో జైళ్లశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అకాడమీ ఏర్పాటుకు రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ ప్రాంతంలో 100ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు జైళ్లశాఖకు అప్పగించారని సబిత తెలిపారు. అకాడమీ ఏర్పాటుకు అవసరమైన దాదాపు రూ.346కోట్లను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.