14 నుంచి ఇందిరమ్మ బాట కార్యక్రమం

కాకినాడ, జూలై 13, : రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటన ఈనెల 14వ తేదీకి వాయిదా పండిందని జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌ వెల్లడించారు. ముందుగా అనుకున్న ప్రకారం ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ఈనెల 12 నుండి 14 వరకూ సియం పర్యటన జరగాల్సి ఉందని అయితే జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా జిల్లా మంత్రులు, ఎంపి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి పర్యటనను ఈనెల 14కు వాయిదా వేసుకోవడం జరిగిందని ఈ పర్యటన 14,15,16 తేదీల్లో ప్రతిపాదిత ప్రాంతాల్లో ఇందిరమ్మబాట కార్యక్రమాలు యదావిధిగా జరుగుతాయని తెలిపారు.