1400పైగా అవినీతి ఆరోపణలు

న్యూఢిల్లీ: పలు మంత్రిత్వ శాఖల వద్ద దర్యాప్తునకు సంబంధించి 1400 పైగా అవినీతి ఆరోపణలు అపరిష్కఋతంగా ఉన్నాయని కెంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. కేంద్ర నిఘా విభాగం ఈ ఆరోపణలను దర్యాప్తు నిమిత్తం సంబంధిత విభాగాలకు పంపిందని కేంద్ర సిబ్బంది వ్వవహారాలశాఖ సహాయమంత్రి వి.నారాయణస్వామి లోక్‌సభకు తెలిపారు.