15నుంచి రెవెన్యూ సదస్సులు

15నుంచి రెవెన్యూ సదస్సులు
సిద్దం అవుతున్న అధికార యంత్రాంగం

జగిత్యాల,జూలై7( జనంసాక్షి): జిల్లాలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రతి మండల కేంద్రంగా మూడు రోజుల పాటు సదస్సు నిర్వహించాల్సి ఉంటుందిజ దీంతో కలెకట్ర్‌ సవిూక్షించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సదస్సులకు సన్నద్దంగా ఉండాలని కలెక్టర్‌ రవి నాయక్‌ అధికారులను ఆదేశించారు. భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి మండలంలో ఇప్పటివరకు అందించిన దరఖాస్తుల మేరకు భూ సమస్యలపై తహసీల్దార్లు సంపూర్ణ నివేదిక తయారు చేసి సమర్పించా లన్నారు. జిల్లాలోని జగిత్యాల రూరల్‌, జగిత్యాల అర్బన్‌, మల్యాల, కొడిమ్యాల మండలాల్లో జాతీయ రహదారి నిర్మాణానికి సంబందించిన భూ సర్వే పక్రియ దాదాపుగా 50 శాతం ముగిసిందని, పెండిరగ్‌ భూ సర్వే పక్రియను రానున్న వారం రోజుల్లో పూర్తయ్యే విధంగా వేగవంతం చేయాలన్నారు. అలాగే పశువులు, జీవాలు, పెంపుడు జంతువులు సంక్రమిత వ్యాధుల బారిన పడకుండా రైతులు, పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రతి సంవత్సరం పెంపుడు జంతువులకు విధిగా టీకాలు వేయించాలని సూచించారు. వీధి కుక్కలు, కోతుల బెడదను నివారించడానికి కుటుంబ నియంత్రణ, వాక్సినేషన్‌ చేసి వదిలిపెట్టడం కోసం మున్సిపల్‌ పరిధిలో రూ25లక్షలతో జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్ర మించే ప్రమాదం ఉందన్నారు.