15 మందికి అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతి
రాష్ట్రంలో 15 మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.పదోన్నతి పొందిన వారిలో టీఎంఎన్ బాబ్జి (రాచకొండ షీటీమ్స్), కే శ్రీకాంత్ (విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్), ఎస్ శ్రీనివాస్‌రావు (ఎస్బీ నిజామాబాద్), సీ కుషల్కర్ (మహేశ్వరం ట్రాఫిక్), జీ నరేందర్ (కరీంనగర్ టాస్క్‌ఫోర్స్), పీ వెంకటరమణ (ఎస్‌ఆర్‌నగర్), ఎస్ చంద్రకాంత్ (సీసీఎస్ సైబరాబాద్), కే పూర్ణచందర్ (సెక్రటేరియట్ సెక్యూరిటీ), జీ హనుమంత్‌రావు (బాలానగర్), కే శ్రీనివాసరావు (శంషాబాద్), జీ రమేశ్ (ఎస్బీ నల్లగొండ), ఎం సుదర్శన్ (జీహెచ్‌ఎంసీ), ఎన్ ఉదయ్‌రెడ్డి (ఏసీబీ), ఎన్ శ్యాంప్రసాద్‌రావు (సీఐడీ), వీ రఘు (కాచిగూడ) ఉన్నారు.