15 రోజుల్లో విద్యుత్‌ పరిస్థితి మెరుగు : షిండే

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విద్యుత్‌ పరిస్థితి 15 రోజుల్లో మెరుగుపడుతుందని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చెప్పారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ కొరతతో అల్లాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో షండే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ”దేశం లో విద్యుత్‌ కొరత ఉన్నమాట వాస్తవమే. ఇది వేసవి కాలం. ఢిల్లీ, ఇతర పెద్ద నగరాల పై ప్రభావం పడింది. రాబోయే 15 రోజుల్లో పరిస్థితి కచ్చితంగా మెరుగుపడుతుంది.” అని బుధవారమిక్కడ విలేకర్లతో చెప్పారు. విద్యుత్‌ శాఖ సహయమంత్రి కేసీ వేణుగోపాల్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజా గణాంకాల మేరకు దేశంలో ద13,653 మెగా వాట్ల విద్యుత్‌లోటు ఉంది.