15 నుంచి సిపిఐ ఆందోళన
ఖమ్మం, జూలై 12 : పట్టణ సమస్యలపై ఈ నెల 15 నుంచి ఆందోళనలు నిర్వహించనున్నట్లు సిపిఐ పట్టణ సమితి కార్యదర్శి మహ్మద్ సలాం తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరాల తరబడి కార్యాలయాల్లో తిష్ఠవేసి ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ప్రజలు వారి పనులే కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పట్టించుకున్న నాధుడే లేడని ఆందోళన వ్యక్తం చేశారు. ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలించి ఇష్టమొచ్చిన రీతిలో అమ్ముతున్నారని, ఇది తగదని ఆయన అన్నారు.