వర్మ తుంటరి చేష్టలపై నెటిజిన్ల మండిపాటు
వయసు పెరిగే కొద్దీ ఏవిూ పాడుబుద్దని వ్యాఖ్యలు
ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే క్రియేటివ్ డైరెక్టర్ అనే వారు. కాని ఇప్పుడు కాంట్రవర్సీలతోనే కాపురం చేస్తున్నాడు.తీసే సినిమాలు,చేసే చేష్టలు అన్నీ కూడా వివాదాలతో ముడిపడి ఉంటున్నాయి. ముఖ్యంగా ఆయన తన కూతురు వయస్సు ఉన్న అమ్మాయిలతో చేసే రచ్చ చర్చనీయాంశంగా మారుతుంది. ఇటీవలి కాలంలో బుల్లితెర యాంకర్స్‌తో తెగ సందడి చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ విూడియాలో షేర్ చేస్తున్నాడు. ఆ మధ్య అరియానాతో బోల్డ్ ఇంటర్వ్యూ ఇచ్చిన
వర్మ రీసెంట్‌ఘా అషూ రెడ్డిని డిఫరెంట్ యాంగిల్‌లో ఫొటో తీసి షాక్ ఇచ్చారు. అప్సరా రాణి, మియా మాల్కోవా, శ్రీ రాపాక, నైనా గంగూలీ.. ఇలా ఆయన పలువురు అమ్మాయిలతో ఎంతగా రచ్చ చేశారో మనం చూశాం. తాజాగా ఫుల్‌గా వోడ్కా కొట్టిన వర్మ బర్త్‌డే జరుపుకుంటున్న అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. మళ్లీ అందుకు సంబంధించిన వీడియోని ధైర్యంగా ’లైఫ్ ఎట్ ఆర్జీవీ కంపెనీ’ ఫేస్ బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో జ్యోతి, శ్రీకాంత్ అయ్యంగార్ ఉండగా, వారు క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ వీడియో చూసి కొందరు నెటిజన్స్ వర్మని ఏకి పారేస్తుండగా, కొందరు వర్మలా బ్రతకాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్ది వర్మ తుంటరి చేష్టలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.
తాజావార్తలు
- బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందే
- ప్రాణాలు ఫణంగా పెట్టి.. ఆఫ్ఘన్ బాలుడి సాహసం
- కోల్‌కతాను ముంచెత్తిన భారీ వర్షాలు
- అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం..
- కెనెడాలో ఖలిస్తానీ ఉగ్రవాది అరెస్ట్
- స్వదేశీ ఉత్పత్తులే కొనండి.. విక్రయించండి
- సూత్రప్రాయంగా.. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ఛత్తీస్‌గఢ్ అంగీకారం!
- అబూజ్మడ్ ఎన్కౌంటర్లో ..
- గడ్చిరోలిలో ఎన్కౌంటర్
- పాక్ అణుబెదరింపులకు తలొగ్గం
- మరిన్ని వార్తలు