16 నుంచి బాసరలో నవరాత్రులు

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 9: దసరా నవరాత్రులను పురస్కరించుకుని జిల్లాలోని బాసర సర్వపతి ఆలయంలో ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 16 నుండి 24 వరకు జరిగే ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో ముత్యాలరావు తెలిపారు. ఇందు కోసం దాతలు ముందుకు వచ్చారని ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నామని, నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఆలయాన్ని రంగులతో ముస్తాబు చేస్తూ విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దసరా ఉత్సవాల్లో సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులకు సమాచారాన్ని అందించామని అన్నారు.