17న బౌద్ధ మహా సమ్మేళనం
వరంగల్ : వరంగల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో ఈనెల 17వ తేదీన ఆంధ్రప్రదేశ్ బౌద్ధమహా సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఆహ్వాన కమిటీ ఛైర్మన్ బొమ్మలకట్టయ్య, కన్వీనర్ ఎన్. సుదర్శన్ పేర్కొన్నారు. ఆదివారం హన్మకొండలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.