17న మంత్రి మండలి భేటి

– మున్సిపల్‌ చట్టంపై కేబినేట్‌లో చర్చ

హైదరాబాద్‌,జులై 15(జనంసాక్షి): తెలంగాణ మంత్రివర్గం ఈనెల 17న సమావేశం కానుంది. ప్రగతిభవన్‌లో బుధవారం సాయంత్ర 4 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరగనుంది. నూతన పురపాలక చట్టం బిల్లుపై కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలపనున్నారు. కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 18న అసెంబ్లీ, 19న మండలి సమావేశమై బిల్లుపై చర్చ జరిపి ఆమోదముద్ర వేయనుంది. వీటితో పాటు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, సాగు సంబంధిత అంశాలు, పురపాలక ఎన్నికల నిర్వహణ, రాష్ట్రంలోని పరిస్థితులు సహా ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. 18న అసెంబ్లీ, 19న శాసనమండలి సమావేశమై బిల్లుపై చర్చించి ఆమోదం తెలుపనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం 17న సమావేశం కానుంది. మున్సిపల్‌ కొత్త చట్టం బిల్లుపై కేబినెట్‌ భేటీలో చర్చించి ఆమోదం తెలుపనుంది. దాంతో పాటు వర్షాభావ పరిస్థితులు, సాగు సంబంధిత అంశాలు, మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణ సహా పలు అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనుంది.