17న రాష్ట్ర మంత్రుల ఇళ్లవద్ద నిరసనలు
విజయనగరం,నవంబర్13(జనంసాక్షి): కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలను రద్దు చేసేంతవరకు పోరాటాలు చేయాల్సిన బాధ్యత అన్ని రంగాల వారిపై ఉందని సిఐటియూ నేతలు అన్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 26న జరుపతలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన లేబర్ కోడ్‌లు, వ్యవసాయ చట్టాలు ఆయా రంగాల కార్మికులకు తీరని నష్టాన్ని చేకూరుస్తాయని అన్నారు. భవన నిర్మాణ రంగ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అమలు చేయాలని కోరుతూ ఇటీవల కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అమలు చేయాలని, కార్మికుల నిధి రక్షణ కోసం ఈనెల 17న రాష్ట్ర మంత్రుల ఇళ్ల వద్ద నిరసన, 26న జరగనున్న అఖిల భారత సమ్మెలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.