17 మంది భారత జాలర్లు అరెస్ట్..

రామేశ్వరం : తమిళనాడుకు చెందిన 17 మంది మత్స్యకారులను శ్రీలంక నావీ అధికారులు అరెస్ట్ చేశారు. హిందూమహాసముద్రంలో కచ్చత్తీవు వద్ద చేపలు పడుతున్న జాలర్లను, వారి బోట్లను శ్రీలంక పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మత్స్యశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్ట్ చేసిన మత్స్యకారులను శ్రీలంక విడుదల చేసిందని, అయితే వారి బోట్లు ఇంకా విడుదల చేయాల్సి ఉందని తెలిపారు.శ్రీలంక నావీ అధికారులు ఈనెల 24న పదుకొట్టాయ్ జిల్లాకు చెందిన 11 మందిని అరెస్ట్ చేశారు. అయితే వారిని ఆతరువాత వెంటనే విడుదల చేశారని చెప్పారు. శ్రీలంక ప్రభుత్వం అరెస్ట్ చేసిన మత్స్యకారుల వెంటనే విడిపించాలని కోరుతూ.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వారంక్రితం ప్రధానమంత్రికి లేఖరాశారు. 1974, 76లలో కుదుర్చుకున్న ఇండో-శ్రీలంక ఒప్పందాలను పునరుద్ధరించాలని లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేశారు.