ఈనెల 18న వైకాపాలో చేరత : మాజీ మంత్రి విశ్వరూప్
హైదరాబాద్ : మాజీ మంత్రి విశ్వరూప్ ఈ నెల 18న వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. సమైక్యాంధ్రకోసం జగన్ మాత్రమే పోరాడుతున్నారని అందుకే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. సమైక్యాంధ్ర కోసం నిరాహార దీక్ష చేస్తున్న జగన్‌ను కలిసి మద్దతు తెలిపారు. సీమాంధ్రుల మనోభావాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినందుకే మంత్రి పదవికి ,పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు విశ్వరూప్ ప్రకటించారు.



