183 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు
జనం సాక్షి : నర్సంపేట
స్థానిక నర్సంపేట ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల సందర్భంగా నర్సంపేట డివిజన్ అధ్యక్షులు బండారి సురేష్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు శుక్రవారంజరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు బండారి సురేష్ ఛాయాచిత్ర పరికరం(ఫోటో కెమెరా) గ్రహీత లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాల సమర్పించి టెంకాయలు జ్యోతి ప్రచురణ తో జండా ఆవిష్కరణ జరపగా ఫోటోగ్రఫీ మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని కరచాల ధనులతో అభినందనలు తెలుపుతూ మిఠాయి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొట్ట మొదటగా ఫొటోగ్రాఫిక్ ప్రక్రియను ఫ్రెంచ్ దేశానికి చెందిన లూయీస్ డాగురే మరియు జోసెఫ్ నైస్పోర్ నీప్సే 1837 సం. లో అభివృద్ధి చేసారు. ఈ ప్రక్రియకు ‘ డాగ్యురో టైప్ ‘ అని పేరు పెట్టారు. అంతక ముందు చిత్ర కళ చేతితో గీయాలి లేక పెయింటింగ్ వెయ్యాలి. ఈ డాగ్యురో టైప్ ప్రక్రియ కనిపెట్టడంతో ఖచ్చితమైన ముఖాన్ని చిత్రించడం కుదిరింది.
19 ఆగస్ట్ 1839 న ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ ఫొటోగ్రఫీ ఆవిష్కరణకు పేటెంట్ పొంది ప్రపంచానికి ఉచితంగా కానుకగా అందించింది. తరువాతి కాలంలో ఈ రోజునే ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం గా జరుపుకుంటున్నారు. ఈ ఫొటో గ్రఫీ కళ ప్రపంచ సృష్టి కెమెరా ద్వారా రాబోయే తరాలకు చూపించే అదృష్టాన్ని కల్పించిన ఫ్రెంచ్ దేశానికి చెందిన లూయిస్ డాగురె కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంతోష్ గౌడ్, అమరేందర్, సోమేశ్వర్, సమ్మయ్య,దుర్గేష్ గౌడ్, జావిద్, నరేష్, విశ్వబంధు, శ్రీనివాస్ రెడ్డి, కన్నయ్య, నరేందర్, వెంకట్, రాజు, శ్రీనివాస్, ప్రకాష్, శివ హరిప్రసాద్, రమేష్, రాజు, రాజ్ కుమార్, రాజు, పవన్, విజయ్, శేఖర్,తదితరులు పాల్గొన్నారు