1942 క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

-ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 09(జనం సాక్షి):
 ఖిలా వరంగల్ మండలం రంగశాయిపేట ప్రాంతంలో మంగళవారం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ మాట్లాడుతూ..
 1942 క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆగస్ట్ ఉద్యమం అని కూడా అంటారు క్విట్ ఇండియా ఉద్యమం స్పూర్తితో మతోన్మాద బీజేపీ ఆర్ఎస్ఎస్ ను వ్యతిరేకించాలని అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని అన్నారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఎటువంటి పాత్ర నిర్వహించకుండా నేడు బిజెపి ప్రభుత్వం తామే నిజమైన దేశభక్తులమని, స్వాతంత్ర పోరాట యోధుల మని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారత వనిలో ఏనాడు జాతీయ జెండాను ఎగురవేయని ఆర్ఎస్ఎస్, మతోన్మాది బిజెపి నేడు కేంద్రంలో స్వాతంత్ర ఉద్యమం గురించి, దేశభక్తి గురించి తామే నిజమైన వారసులమని ప్రచారం చేసుకుంటుందని ఆయన విమర్శించారు. దేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా మత ఘర్షణలు సృష్టించిందని అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం రావాలని అనేక ఉద్యమాలలో ప్రత్యక్షంగాను కమ్యూనిస్టులు మాత్రమే పని చేశారని అన్నారు. నాడు క్విట్ ఇండియా ఉద్యమంలో సుమారు లక్ష మందికి పైగా జైలుకు వెళ్లిన ఘటన లో కమ్యూనిస్టుల పాత్ర మరువలేనిదని, హిందుత్వ వాదంతో మత ఘర్షణలను చేసే ఆర్ఎస్ఎస్, బిజెపి ఆనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదని, ప్రజలను మభ్య పెట్టేందుకే బిజెపి స్వాతంత్ర జాతీయవాదం లేవనెత్తుతుందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి  భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా పరిపాలన చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆదిత్య, నరేష్, సుమన్, రంజిత్, దీపక్, ఇమ్రాన్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు