2కె ఫ్రీడం రన్ ను ప్రారంభించిన
ఎస్సై లావుడ్యా నరేష్
– సర్పంచ్ శ్యామల రంగమ్మ
కురివి ఆగస్టు-11 (జనం సాక్షి న్యూస్)
75వ భారత స్వతంత్ర వజ్రోత్సవాల వేడుకలు భాగంగా కురవి మండలం సిరోలు గ్రామంలో సిరోలు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 2కె ఫ్రీడమ్ రన్ ను జెండా ఊపి ప్రారంభిచిన సిరోలు ఎస్సై లావుడ్యా నరేష్, సిరోలు గ్రామ సర్పంచ్ శ్యమల రంగంమ్మ.
ఈ సందర్భంగా ఎస్సై నరేష్ మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల త్యాగఫలంతోనే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని అన్నారు. మహనీయుల వీరోచిత పోరాటం,వారి త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని స్వాతంత్రం స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బొజ్యా నాయక్,ఉపసర్పంచ్ నాగేశ్వార రావు,వార్డు సబ్యులు,సిరోలు ఏకలవ్య విద్యార్థులు,పోలీసులు,అధికారులు, ప్రజా ప్రతినిధులు,గ్రామ పెద్దలు యువకులు మహిళలు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.