2న పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్
వరంగల్, జనవరి 31 (): ఫిబ్రవరి 2న డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్‌ను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల శ్రీనివాసచారి ఒక ప్రకటనలో తెలిపారు. పరకాల సబ్ డివిజన్‌లోని పరకాల, రేగొండ, గణపురం, మొగుళ్లపల్లి, శాయంపేట, భూపాలపల్లి మండలాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు, తెలుగు, ఇంగ్లీషు మీడియాల్లో వేరువేరుగా టెస్ట్ ఉంటుందన్నారు. ఉదయం టాలెంట్ టెస్ట్ నిర్వహించి సాయంత్రం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు పురస్కారాలను అందజేస్తామని తెలిపారు.