2 లక్షలు దాటిన అమర్‌నాథ్‌ యాత్రికుల సంఖ్య

జమ్ము: ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అమర్‌నాథ్‌ చేరుకుని మంచులింగానికి ప్రణామాలర్పించిన యాత్రికుల సంఖ్య ఈ ఏడాది ఇప్పటికే రెండు లక్షలు దాటింది. దక్షిణ కాశ్మీరంలోని ఈ శైవక్షేత్రానికి ఇప్పటికి 2,10,524 మంది యాత్రకులు వచ్చారని అధికారులు గురువారం నాడు ప్రకటించారు. మరో 21,000 మంది దారిలో ఉన్నారు. ఇప్పటివరకు యాత్ర సజావుగా సాగుతోందని, ఆగస్టు 2న ఈ ఏటి అమర్‌నాథ్‌ యాత్ర ముగుస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.