పృధ్వి-2 క్షిపణి రెండోసారి ప్రయోగం
హైదరాబాద్ : పృధ్వి-2 క్షిపణిని శాస్త్రజ్ఞులు ఈ రోజు రెండోసారి ప్రయోగించారు. ఒడిశాలోని చండీపూర్ నుంచి దీనిని ప్రయోగించారు. ఉపరితలం నుంచి ఉపరితలానికి అణ్వాయుధాలను మోసుకెళ్లగల, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ క్షిపణిని సాధారణ పరీక్షల్లో భాగంగా నిన్న కూడా విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే.



