జూన్ 2నే అపాయింటెడ్ డే
టీఆర్‌ఎస్ విన్నపాన్ని తోసిపుచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ, మే 8 (జనంసాక్షి) :
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చే అపాయింటెడ్ డేను ముందుకు జర పడం సాధ్యం కాదని, ముందుగా నిర్ణయించినట్లుగానే జూన్ రెండునే అపా యిం డెట్ డేగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 16న వెలువడనున్న నేప థ్యంలో అదే రోజున అపా యింటెడ్ డేగా ప్రకటిం చాలంటూ టీఆర్‌ఎ స్ చేసి న విజ్ఞప్తిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తోసి పుచ్చింది. ఎన్నికల ఫలితాలు వెలు వడిన 16 రోజుల విరామం తర్వాత అపాయిం టెడ్ డేను నిర్ణయించడంతో రాజ్యాంగప రమైన సమస్యలు తలెత్తే అవకాశముం దంటూ టీఆర్‌ఎస్ నేత జగదీశ్వర్‌రెడ్డి హైకోర్టును ఆశ్ర యించారు. ఆయన పిటిష న్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషనర్ అభ్యర్థన సరైనే దనని, కేంద్ర ప్రభు త్వం ఈ అంశాన్ని పరిశీలించాలంటూ సూచించింది. ఈమేరకు టీఆర్‌ఎస్ సెక్ర టరీ జనరల్ కె. కేశవరావు, ఆ పార్టీ నేతలు బోయినపల్లి వినోద్‌కుమార్, జగదీ శ్వర్‌రెడ్డి బుధవారం కేంద్ర హోం శాఖ అధికారులను కలిసి హైకోర్టు సూచనలతో కూడిన విజ్ఞప్తిని అందజేశారు. అపాయింటెడ్ డేను ముందుకు జరిపి తెలంగాణలో తొలి ప్రభుత్వ ఏర్పాటు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే వారి అభ్యర్థన ఆధారంగా అపాయిండెట్ డేను ముందుకు జరపలేమని కేంద్రం స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాలకు బదలాయింపులు చేయాల్సి ఉన్నందున, ఇతర కారణాలరీత్యా అపాయింటెడ్ డే ముందుకు జరపడం సాధ్యం కాదంటూ తేల్చిచెప్పింది.