20న జిల్లాకు రానున్న హైకోర్టు న్యాయమూర్తి

కోర్టుచౌరస్తా, (జనంసాక్షి): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సముద్రాల గోవిందరాజులు ఆదివారం జిల్లాకు రానున్నట్లు అధికారి జె.జి.కె. ప్రసాద్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లో బయలుదేరి సిద్ధిపేట మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు వేములవాడ సమీపంలోని అగ్రహారం చేరుకొని ఆలర్ణయాని& సందర్శించి అక్కడి నుంచి 3 గంటలకు వేములవాడకు చేరుకొని అతిథి గృహంలో బస చేస్తారు. అనంతరం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరిగి ప్రయాణం అవుతారని తెలిపారు.