20న బ్యాంకు ఉద్యోగులు చేపట్టనున్న సమ్మె

నిజామాబాద్‌, జనవరి 4 (): బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్టు సవరించే ప్రతిపాదనకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ నెల  20న చేపట్టనున్న సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రంలో బ్యాంకులు ఉద్యోగులు నరిసనలు తెలిపారు. నగరంలో ఆంధ్రా బ్యాంక్‌ ఎదుట ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రతిపాదించిన రెగ్యులేషన్‌ యాక్టు ఉపసంహరించుకోవాలని బ్యాంకు ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యాక్షుడు బోస్‌బాబు డిమాండ్‌ చేశారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు నాగరాజురెడ్డి, కిషన్‌రావు, బ్యాంకుల  ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.