20 మంది భాజపా అభ్యర్థులు నేరగాళ్లే

3

మోడీవన్ని వట్టి అబద్ధాలే: రాహుల్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి4(జనంసాక్షి): దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 20 మంది భాజపా అభ్యర్థులు నేరగాళ్లేనని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోదీపై, కాషాయం పార్టీపై రాహుల్‌ వ్యంగ్యస్త్రాలు సంధించారు. బుధవారం న్యూఢిల్లీలోని జహంగీర్‌ పూరీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌ మాట్లాడుతూ….  నేరగాళ్లకు దూరమని ఆ పార్టీ నాయకులు ఓ గప్పాలు కొట్టుకుంటారు… కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆ పార్టీ అభ్యర్థుల్లో 20 మందికి నేర చరిత్ర ఉందని ఆరోపించారు. అలాగే ప్రధాని మోదీ ‘మేకిన్‌ ఇండియా’ అంటూ ప్రచారం చేస్తారు… కానీ ఆయన ధరించిన సూటు ఖరీదు రూ. 10 లక్షలు ఉంటుంది. అది కూడా విదేశాలలో తయారైందని చెప్పారు.తాము అధికారంలోకి రాగానే దేశంలో ధరలు తగ్గిస్తామన్నారు… నిరుద్యోగులకు ఉద్యోగాలన్నారు. విూ హావిూలన్నీ ఏమయ్యాయని ఆయన ప్రధాని మోదీని ప్రశ్నించారు. మోదీ మాటలకు చేతలకు పొంతన ఉండదని రాహుల్‌ ఈ సందర్భంగా తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఎంత తగ్గింది ? దేశంలో చమురు ధరలు  ఎంత తగ్గించారని రాహుల్‌ ఈ సందర్బంగా మోదీ సర్కార్‌ సూటిగా ప్రశ్నించారు. పెట్రోల్‌ ధరలు అంత తగ్గినా… ద్రవ్యోల్బణం అదుపులోకి ఎందుకు లేదో వెల్లడించాలని మోదీ సర్కార్ను డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రెండేళ్లలో ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర ¬దా తీసుకొస్తామని రాహుల్‌ హస్తిన ప్రజలకు హావిూ ఇచ్చారు. తన శాఖ కార్యకలాపాల్లో కాంగ్రెస్‌ యువ నేత జోక్యం చేసుకునేవారంటూ కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్‌ చేసిన ఆరోపణలపై రాహుల్‌ గాంధీ నోరు విప్పారు. దిల్లీ ఎన్నికల్లో భాగంగా ఆయన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలు, ఆదివాసీల సంక్షేమం గురించి మాత్రమే జయంతి నటరాజన్‌తో తాను చర్చలు జరిపినట్లు రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.