స్కూలు బస్సును ఢీకొన్న రైలు..20మంది మృతి

0gwwvnl1-copy
మరో 12 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు

మెదక్ : మెదక్ జిల్లాలో గురువారం ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది.  వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద  ఓ  ప్రయివేట్ స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొన్న ఘటనలో 20మంది విద్యార్థులు మృతి చెందారు. రైల్వే గేటు దాటుతుండగా కాకతీయ పాఠశాలకు చెందిన బస్సును ఓ రైలు ఢీకొంది ఈ ప్రమాదం జరిగినప్పుడు  బస్సులో మొత్తం 30మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు.  రైల్వే గేట్ వద్ద కాపలా లేకపోవటం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఈ క్రాసింగ్ వద్ద అనేక ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడిన విద్యార్థుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.