కెరిర్‌లో 200ల టెస్ట్ మ్యాచ్
ఆడనున్న సచిన్
కోల్‌కతా జూలై 15 (జనంసాక్షి):
చివరి టెస్టులోఓ తడబడకుండా టెస్టు మ్యాచుల్లో ఆడి, మంచి స్ధితిలో తప్పుకోవాలని భారత క్రికెట్ జట్టు మాజి కెప్టెన్ సౌరవ్ గంగూలీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌కు సలహా ఇచ్చాడు. వచ్చే ఏడాది ప్రాంరభంలో దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో సచిన్ టెండుల్కర్ తన కెరీర్‌లో 200వ టెస్టు మ్యాచు ఆడబోతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు మ్యాచుల సిరిస్‌లో సచిన్ టెండుల్కర్ మంచి అత్యుత్తమ ఆట చూశానని వ్యక్తిగతంగా తాను ఈ విషయం టెండూల్కర్‌కు చెప్పానని ఆయన అన్నారు. ఆదివారం సౌరవ్ గంగూలీ ఓ వార్తా పత్రికలో తన అభిప్రాయలను పంచుకున్నాడు. టెండు ల్కర్ 200వ మ్యాచు అడడం కన్నా దక్షిణాఫ్రికాలో సెంచరీ చేయాలనేది తన అబిమతమని అన్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్ నుండి సచిన్ టెండు ల్కర్ గత సంవత్సరం తప్పుకున్నాడు. ఏప్రిల్, జూన్ నెలల్లో జరిగిన ఐపి యల్ మ్యాచుల్లో ముంబై తరపున అతను ఆడాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లడానికి ముందు సచిన్ టెండుల్కర్ చాంపియన్స్ లీగ్ టీ20 ఆడనున్నాడు.