2012 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయండి

సీఎంను కలిసిన కోదండరామ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని బుధ వారం రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదం డరామ్‌ హైదరాబాద్‌లో కలిశారు. డీఎస్సీ 2012 అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. డీఎస్సీ నిర్వహించి ఇన్ని రోజు కావస్తున్నా నియామకాలు చేపట్టక పోవడంతో వారు నిరుత్సాహానికి గురవుతున్నారని పేర్కొన్నారు. నిరుద్యో గుల ఆశలను వమ్ము చేయకుండా నియామకాలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతున్నం దున ఉపాధి అవకాశాలను పెంచి ఉద్యో గావకాశాలను కల్పించాలని చెప్పారు. ఆకలి, దారిద్య్రం పెరగడానికి కారణం నిరుద్యోగమేనని పేర్కొన్నారు. నిరుద్యోగ నిర్మూలనకు పాటుపడాలని అన్నారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించి త్వరలోనే నియామకాలు చేపడతామని తెలిపారు.