2014లో అధిక స్థానాల్లో తెదేపా గెలుపు ఖాయం: నారా లోకెశ్‌

చంద్రగిరి: తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌ బుధవారం నారావారిపల్లికి చేరుకున్నారు. చంద్రబాబు పినతండ్రి నారా పాపయ్య నాయుడు దశదిన కర్మ కార్యక్రమానికి లోకెశ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ పార్టీ అభ్యున్నతికి సాధారణ కార్యకర్తగానే శ్రమిస్తానన్నారు. ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ తండ్రి చేపట్టనున్న 112 రోజులపాటు పాదయాత్ర విజయంతమవుతుందన్నారు. 2014లో అధిక స్థానాలో తెదేపా గెలుపు ఖాయమని లోకేశ్‌ చెప్పారు.