2014లో హంగ్‌ తప్పదు : సీపీఐ నారాయణ

నెల్లూరు : గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే 2014లో కేంద్రంలో హంగ్‌ అసెంబ్లీ తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హిమాచల్‌ ప్రదేశ్‌లో అధికారం చేజిక్కించుకోగా, గుజరాత్‌లో కొంత పుంజుకొన్నట్లుగా కనిపిస్తోందన్నారు. భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా భవిష్యత్తులో నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం వల్లే గుజరాత్‌లో గెలుపు సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. కానీ ఆ పార్టీ మోడీ ప్రధాని కాదని, అద్వానీయే ప్రధాని అభ్యర్థి అని చెప్పారు.