2014 మన్మోహనే ప్రధాని : ద్వివేది

ఢిల్లీ : 2041 వరకు మన్మోహన్‌ సింగ్‌ ప్రధాన మంత్రిగా ఉంటారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జనార్థన్‌ ద్వివేది చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిని మన్మోహన్‌ సింగ్‌ పేరు ప్రస్తావనే లేదని, రాష్ట్రపతి అభ్యర్థిని మమత ఎలా నిర్ణయిస్తారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ నుంచి ప్రణాబ్‌ , హమీద్‌ అన్సారీల పేర్తు ప్రతిపాదనలో ఉన్నాయని అబ్దూల్‌కలాం, సోమనాధ్‌ చటర్జీల పేర్లను కాంగ్రెస్‌ తిరస్కరించిందని ద్వివేది చెప్పారు. యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిని ఈ రోజు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటిస్తారని ఆయన అన్నారు.