2020లో మరో క్యూరియాసిటీ శోధక నౌకను పంపనున్న నాసా
అమెరికా : 2020లో మరో క్యూరియాసిటీ శోధక నౌక (రోవర్)ను పంపనున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది. ఇప్పటికే అరుణగ్రహంపైకి పంపిన రోవర్ విజయవంతంగా పనిచేస్తోందని, 2020లో మరో రోవర్‌ను పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు నాసా తెలిపింది. క్యూరియాసిటీ తొలి మట్టి విశ్లేషణలో అంగారకుడిపై కార్బన్ మూలకం, ఆక్సిజన్, నీటి అణువుల ఆనవాళ్లు ఉన్నట్లు తేలిన నేపథ్యంలో వచ్చే 2030 నాటికి మానవరహిత అంగారక యాత్ర చేపట్టాలని నాసా భావిస్తోంది. ఇకపోతే 2016లో ఇన్‌సైట్ రోవర్‌ను అక్కడికి పంపనున్నట్లు కొన్ని నెలల క్రితమే ప్రకటించింది. దీంతో మార్చ్‌పై పరిశోధనలో అమెరికా రోవర్ల సంఖ్య ఏడుకు చేరుకుంది.