అంక్షలు లేని జీవన భృతి బీడీ కార్మికులకు వెంటనే ఇవ్వాలని భైంసా లో భారీ ర్యాలీ ధర్నా!

*నవంబరు15 జనం సాక్షి, భైంసా రూరల్
నిర్మల్ జిల్లా భైంసా, అంక్షలు లేని జీవన భృతి 2016 రూపాయలు బీడీ కార్మికులందరికీ వెంటనే ఇవ్వాలని IFTU రాష్ట్ర అధ్యక్షులు టీ శ్రీనివాస్ డిమాండ్ చేశారు.మంగళవారం భైంసా పట్టణంలో భారీ ర్యాలీ ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం బీడీ పరిశ్రమను సంక్షోభంలో నెట్టిందని, మినీ సిగరెట్ కార్పోరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తుందని, అందువల్ల లక్షలాదిమంది బీడీ కార్మికుల పని దెబ్బతిని ఆర్థిక సమస్యలతో సతమవుతమవుతున్న తరుణంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంగా, కెసిఆర్ బీడీ కార్మికులకు జీవన భృతి ఇస్తానని హామీ ఇచ్చి అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయగా తిరిగి ఆందోళన చేసి అమలు చేయించుకున్న చరిత్ర మన కార్మికులదని ఆయన గుర్తు చేశారు. కటౌట్ డేట్ల పేరుతో అనేక ఆంక్షలు వల్ల చాలామందికి జీవన భృతి రాకపోవడంతో తిరిగి యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించామని, 2018 ఎన్నికల సందర్భంగా బీడీ కార్మికుల జీవన భృతి 2016 రూపాయలు ఇవ్వాలని కోరగా, ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలను డిమాండ్ చేయగా మొదల సాధ్యం కాదన్న కేసీఆర్ తిరిగి తాను అధికారంలోకి రాగానే 2016 రూపాయల జీవన ప్రతి ఇస్తానని ప్రకటించి అమలు చేశారని ఆయన తెలిపారు. ఇది బీడీ కార్మికుల పోరాట విజయమేనని ఆయన గుర్తు చేశారు. ఇంకా అనేకమంది బీడీ కార్మికులు ప్రభుత్వం పెట్టిన అంక్షలు వల్ల జీవనభృతి రాక ఆవేదన చెందుతున్నారని,
ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం బీడీలు చేసే ప్రతి కార్మికురాలకు మరియు కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగి, సిబ్బందికి నెలకు 2016 రూపాయల జీవన మృతి వెంటనే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీ మాట్లాడుతూ కేంద్రం kotpa లాంటి చట్టాలు చేస్తూ కార్మికుల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారని,కనీసం జీవనభృతి కూడా అందడం లేదని ,విమర్శించారు.ఇప్పటికైనా జీవనభృతి ఇవ్వకుంటే పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం హరిత,సీపీఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జే రాజు,pdsu జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్,మహేందర్,నవీన్,యూనియన్ నాయకులు సాగర,విజయలక్మి తదితరులు పాల్గొన్నారు