2023 వన్డే ప్రపంచకప్‌కు ఆతిధ్యమివ్వనున్న భారత్

లండన్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌కు వేదిక ఖరారైంది. 2017లో ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను ఇంగ్లాండ్‌లో నిర్వహిస్తున్నట్లు ఐసీసీ వెల్లడించింది. 2021లో జరిగే రెండో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ భారత్ అతిధ్యం ఇవ్వనుంది. మరోవైపు తాజాగా జరిగిన చాంపియన్స్ ట్రోఫియే ఆఖరిదని ఐసీసీ వెల్లడించింది. ‘ఇంగ్లాండ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫికి విశేషమైన ఆదర ణ లబించింది. కానీ ప్రస్తుతం ఉన్న మూడు ఫార్మెట్లకు నాలుగేళ్ల విదామంలో మూడు టోర్నీలు ఉండాలనేది ఐసీసీ ఆలోచన. అందుకే చాంపియన్స్ ట్రోఫీ స్దానంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను ప్రవేశపె డుతున్నాం’ అని ఐసీసీ ముఖ్య కార్యనిర్వా హణాధికారి డేవ్ రిచర్డ్స్‌సన్ చెప్పాడు. వన్డే టి20 ర్యాంకింగ్స్‌ను లెక్కించేటపుడు. ఇక నుంచి నాలుగేళ్ల మ్యాచ్‌ల ఫలితాలను పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పటివరకు మూడేళ్ల ఫలితాలనే చూసేవారు. 2016 టి20 ప్రపంచకప్, 2023 వన్డే ప్రపంచకప్‌లకు భారత్ అతిధ్యమిస్తుంది. 2016 నుంచి ప్రతి నాలుగేళ్లకోసారి టి 20 ప్రపంచకప్ జరుగుతుంది. 2014 టి20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ ఆతిధ్యమిస్తుంది. పసికూన ఆఫ్గానిస్తాన్‌కు ఐసీసీ అసోసియేట్ సభ్యత్వం లభించింది. ఐసీసీ వార్షిక సమావేశం ముగిసింది.

టెస్ట్ చాంపియన్‌షిప్ 2017లో
లండన్: ఇంగ్లండ్ వేదికగా 2017లో తొలి టెస్ట్ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. నాలుగేళ్లకోకసారి నిర్వహించతలపెట్టిన ఈ టోర్నిలో రెండో అంచే (2021) కు భారత్ అతిథ్యమివ్వనుంది. ఐసీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
బంతి మారిస్తే 5 రన్స్ పెనాల్టీ : ఇటీవల ముగిసిన చాంపియన్స్ ట్రోఫిలో చోటుచేసుకున్న బాల్ టింపరింగ్ వివాదంపై ఐసీసీ క్రికెట్ కమిటీ సమావేశంలో చర్చ సాగింది. బౌలర్లు బంతి స్వరూపాన్ని ఉద్దేశపూర్వకంగా మార్చారని భావిస్తే బాల్‌ను మార్చిన ఫీల్దింగ్ జట్లుకు ఐద పరుగుల పెనాల్టీ విధించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాగా, బీసీసీఐ తొలి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్న అంపైర్ నిర్ణయ సమీక్ష (డీఆర్‌ఎస్) ఈ సమావేవంలో చర్చ సాగలేదు.
            
              


