భారత్‌ విజయలక్ష్యం 207 పరుగులు

బర్మింగ్‌హామ్‌: భారత్‌తో బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో ఇంగ్లాండ్‌ 49.3 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌట్‌ అయింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ జట్టులో అలీ 67, రూట్‌ 44, మోర్గాన్‌ 32, బట్లర్‌ 11, వోక్స్‌ 10 పరుగులు చేశారు. మిగతాబ్యాట్స్‌మెన్‌ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో షమీ 3, కుమార్‌ 2, జడేజా 2 వికెట్లు తీయగా.. అశ్విన్‌, రైనా చెరో వికెట్‌ తీసుకున్నారు.