21న ఖమ్మం లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయండి టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి జమాల్ పూర్ వంశీ

కొండమల్లేపల్లి డిసెంబర్ 18 జనంసాక్షి న్యూస్ : ఈనెల 21న ఖమ్మంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి జమాల్ పూర్ వంశీ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే కాలంలో తెలంగాణలో ప్రత్యామ్నాయంగా మారబోతున్న టిడిపి తెలంగాణ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఈనెల 21 తేదీన లక్ష మందితో ఖమ్మం లో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు ప్రజలు హాజరుకావాలని కోరారు తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో జరగబోయే భారీ బహిరంగ సభ తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు ఇన్ని రోజులు  తెలంగాణ సెంటిమెంటుతో అడ్డం పెట్టుకొని టిఆర్ఎస్ ఇప్పుడు  ప్రజలను మోసం చేసేందుకు బిఆర్ఎస్ గా మారింది  అన్నారు రాబోయే కాలంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్ వైభవం వస్తుందని ఆశ భావం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు