21,28 మిలియన్ డాలర్లు పలికిన గోల్కొండ వజ్రం
జెనీవా: నవంబర్ 14, (జనంసాక్షి):
భారత్ గోల్కొండ గనుల నుంచి తీసిన పెద్ద పరిమాణంకల లోపరహిత వజ్రం జెనీవాలో మంగళవారం రాత్రి రికార్డు ధర అయిన 21,48 మిలియన్ డాలర్లకు విక్రయమైంది అరుదైన వర్ణరహిత వజ్రం బరువు 76,02 క్యారట్‌లు పెద్ద స్ట్రాబెర్రీ పండు పరిమాణం ఉంటుంది. ఆర్చ్‌డ్యూక్ ఆఫ్ ఆస్ట్రియా (1872,1962 ) అధీనంలో ఇది ఉండేది హంగరీ రక్తం కల ఈ రాజు సాబ్స్‌బర్గ్స్ వంశానికి చెందిన వారు . అనుకున్నధర కన్నా ఇది రెట్టింపు ధర పలికింది గోల్కొండ వజ్రానికి ఇది రికార్డు అని పైగా దీనికి రంగులేదని క్రిస్టీ సంస్థ అంతర్జాతీయ ఆభరణ విభాగం డైరెక్టర్ ఫ్రాంకోయిస్ క్యూరియల్ చెప్పారు కొనుగోలుదారు తన పేరు రహస్యంగా ఉంచమని కోరారన్నారు ఈ వజ్రాన్ని బ్లాక్,అండ్ ఫ్రాస్ట్ కం పెనీ విక్రయించింది 1810 లో ఈ కం పెనీని స్థాపించారు, కాలిఫోర్నియాలో కార్యాలయం ఉంది.