22 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉచిత సైకిల్స్ పంపిణీ
ఎంపీపీ సత్యహరిశ్చంద్ర
కుల్కచర్ల, నవంబర్ 11(జనం సాక్షి):
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 22 మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత సైకిల్స్ పంపిణీ చేయడం అభినందనీయమని స్థానిక ఎంపీపీ సత్యహరిశ్చంద్ర అన్నారు.శుక్రవారం కుల్కచర్ల మండల పరిధిలోని సాల్వీడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ మన్నన్ ఆధ్వర్యంలో పాఠశాలకు దూర ప్రాంతాల నుండి వచ్చే 8,9,10వ తరగతి చదువుచున్న పేద విద్యార్థినిలకు రూ.1,20,000 రూపాయల విలువ గల 22 ఉచిత సైకిల్ లను వేర్ ఆర్ ద ఉమెన్ మరియు పీపుల్ హెల్పింగ్ చిల్డ్రెన్స్ స్వచ్ఛంద సంస్థల డైరెక్టర్ లు వర్ష భార్గవి, సంతోష్ ,విశిష్ట అతిథి ఇఫ్లూ విశ్వ విద్యాలయ ప్రో”శుషి థారుతో కలిసి ఆమె విద్యార్థులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ మన్నన్ మాట్లాడుతూ..స్వచ్ఛంద సంస్థల సేవలు మరువలేనివన్నారు.మా పాఠశాలకు దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు సైకిల్ ఇచ్చిన వేర్ ఆర్ ద ఉమెన్ మరియు పీపుల్ హెల్పింగ్ చిల్డ్రెన్స్ స్వచ్ఛంద సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో విద్యాధికారి హాబీబ్ అహ్మద్, దోమ మండల విద్యాధికారి హరిచందర్, గ్రామ సర్పంచ్ బాలయ్య, గ్రామ సొసైటీ డైరెక్టర్ కొండన్న, ఎస్ఎంసీ చైర్మన్ ఛాన్ పాషా,గ్రామ మాజీ ఎంపీటీసీ నర్సింలు,గ్రామ యువజన సంఘ నాయకులు ప్రభు, రామకృష్ణ,మ్యాజిక్ బస్ నర్సింలు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం,రమేష్, శ్రీను,కేశవులు, సంతోష ,శివనీల, సీఆర్పిలు కృష్ణ, గాంగ్య తదితరులు పాల్గొన్నారు.