విద్యారంగ సమస్యలను పరిష్కరించండి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం.

 

భైంసా రూరల్ జూలై17 జనం సాక్షి: ముధోల్ నియోజకవర్గం లోని విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) అధ్వర్యంలో ఈరోజు ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డిగారి విట్టల్ రెడ్డి గారికి , దెగాం లోని ఆయన నివాసంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా PDSU జిల్లా అద్యక్షులు వాగ్మారే మహేందర్ మాట్లాడుతూ…భైంసా డివిజన్ కేంద్రంలోని కిసాన్ గల్లీలో గల ప్రభుత్వ బాలికల పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. పాఠశాలలోని విద్యార్థినులకు తక్షణమే మరుగుదొడ్లు, మిని మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఆ పాఠశాల భవనాన్ని కూల్చివేసి, నూతన పాఠశాల భవనాన్ని నిర్మించాలని ఎమ్మెల్యే ను కోరారు. ఈ విషయమై ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి స్పందించి మన-ఊరు మన-బడి పథకంలో ఈ పనులను ప్రారంభమయ్యేలా చూస్తానని అన్నట్లు తెలిపారు. భైంసా డివిజన్ కేంద్రంలోని అద్దె భవనాల్లో కొనసాగుతున్న కళాశాల వసతిగృహాలను ప్రభుత్వం పక్కాభవనాలను నిర్మించాలని కోరారు.
మరియు ముధోల్ మండలం లో ప్రభుత్వ ఐటీఐ కళాశాలను నెలకొల్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో PDSU జిల్లా నాయకులు రాజారాం, గంగరాజు, రుద్రప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.