23న మానమహానాడు అత్యవసర భేటీ

జనంసాక్షి, హైదరాబాద్‌ : మాలమామానాడు రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశం ఈ నెల 23న హైదరాబాద్‌లో జరగనుంది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు మాలమహానాడు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జూవూడి ప్రభాకర్‌రావు, జి.చెన్నయ్యలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌, లోపభూయిష్టమైన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌, రాబోయే కాలంలో దళితులు నిర్వహించాల్సిన పాత్రను ఈ సమావేశంలో చర్చించనున్నామని పేర్కొన్నారు. సమావేశానికి అన్ని జిల్లాల మాలమహానాడు అధ్యక్ష, కార్యదర్శులు, వివిధ హోదాల్లో రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరు కావాలని విజ్ఞప్తిచేశారు.