23న మక్తల్ లో జిల్లా స్థాయి షూటింగ్ బాల్ ఎంపికలు

జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి

మక్తల్, సెప్టెంబర్ 21, జనంసాక్షి

తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి సిహెచ్ ఐలయ్య ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈనెల 23న శుక్రవారం ఉదయం 10 గంటలకు మక్తల్ మినీ స్టేడియంలో 19 సంవత్సరాల లోపు జూనియర్ బాలబాలికలకు నారాయణపేట జిల్లా స్థాయి షూటింగ్ బాల్ ఎంపికలను నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు జి. గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.గోపాలం, కోశాధికారి బీ.రూప ,నిర్వహణ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిలు బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. నారాయణపేట జిల్లాలోని బాలబాలికలు వాలీబాల్ క్రీడలో ప్రావీణ్యత గలవారు షూటింగ్ బాల్ క్రీడల్లో ఆడుటకు అవకాశం కలదని ,షూటింగ్ బాల్ క్రీడలో పాల్గొన్న బాల బాలికలు 01_04_2003 తర్వాత జన్మించిన వారు అర్హులని ,బోనఫైడ్ ,ఆధార్ కార్డుతో హాజరుకావాలని వారు తెలిపారు. ఈ షూటింగ్ బాల్ క్రీడలను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని వారు తెలిపారు .ఇట్టి జిల్లా స్థాయి షూటింగ్ బాల్ క్రీడలో క్రీడా నైపుణ్యతను ప్రదర్శించిన క్రీడాకారులను ఎంపిక చేసి ఈనెల 28 నుండి 30 వరకు రంగారెడ్డి జిల్లాలో జరుగు రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ క్రీడలకు పంపుతామని వారు తెలిపారు. నారాయణపేట జిల్లాలోని షూటింగ్ బాల్ క్రీడలో ఆసక్తి గలవారు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు .షూటింగ్ బాల్ క్రీడా స్పోర్ట్స్ కోట తెలంగాణ రాష్ట్రంలో కలదని వారు చెప్పారు. నారాయణపేట జిల్లాలోని పీఈటీలు, పిడి లు తమ విద్యార్థులను ప్రోత్సహించి క్రీడల్లో పాల్గొనే విధంగా చూడాలని, విద్యార్థులతోపాటు మీరందరూ హాజరుకావాలని అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు గోపాల్ రెడ్డి, బి.గోపాలం విజ్ఞప్తి చేశారు.