23న టీఆర్‌ఎస్ సమావేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 20 : టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని సోమవారం నిర్వహించనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పొలిట్‌బ్యూరో సభ్యులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు పాల్గొంటారు. ఈనెల 29న జరిగే సకల జనుల భేరి విజయవంతం, ఉద్యమ కార్యాచరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.



