మంథనిలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల సంబరాలు జనంసాక్షి, మంథని : అధికార భారత రాష్ట్ర సమితి రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించింది. సోమవారం తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో తొమ్మిది మంది సిట్టింగులకు మరోసారి అవకాశం ఇవ్వగా.. మంథని నుంచి పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మధుకర్ కు అవకాశం ఇచ్చారు. పుట్ట మధుకు టికెట్ రావడంతో మంథని నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి, రంగులు చల్లుకొని, బాణసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.