గ్రామాల్లో కానరాని ఫాగింగ్ .

దోమల బెడద, మలేరియా టైఫాయిడ్ జ్వరాలతో బాధపడుతున్న ప్రజలు.
జ్వరం సాక్షి/ కొల్చారం
తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో దోమల బెడద నివారణకు గ్రామాలకు పల్లె ప్రగతిలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలకు ఫాగింగ్ మిషన్లు సరఫరా చేసింది. పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్ల నిర్లక్ష్యం మూలంగా ఫాగింగ్ మిషన్లు మూడు రోజుల ముచ్చటగా మారాయి. మండలంలోని అన్ని గ్రామాలలో ఫాగింగ్ చేయకపోవడంతో దోమల బెడదతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మలేరియా టైఫాయిడ్, డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధులతో ప్రజలు బాధపడుతున్నారు అయినప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు దోమల నివారణకు పాగింగ్ చేయడంపై దృష్టి సారించడం లేదు. దీంతో ఫాగింగ్ మిషన్లు మూలకు చేరాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు జోక్యం చేసుకొని నాలుగు రోజులకు అన్ని గ్రామాలలో ఫాగ్ ఇంగ్ చేసేలా చూడాలని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

తాజావార్తలు